ఉపాధిలో అక్రమాలకు ఈకేవైసీతో చెక్
ఉపాధిలో అక్రమాలకు ఈకేవైసీతో చెక్ సత్తెనపల్లి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు ఉన్న వేతనదారులు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆధార్ కార్డును జాబ్‌కార్డుతో అనుసంధానం చేసుకుంటేనే పనికల్పించాలని నిర్ణయించింది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎంజీఎన్‌ఆర్ ఇజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టింది. ఉపాధి వేతనదారుల ఆధార్ వివరాలు నమోదు చేసి ముఖ గుర్తింపు ఫొటో యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. దీనికోసం వేతనదారులు తమ ఆధార్, జాబ్ కార్డులతో స్వగ్రామంలోని ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదిస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు. అయితే ఆధార్ కార్డును వేతనదారులు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని వారికి ఇకపై పని కల్పించడం వీలుపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పారదర్శకత లేదనే ఆరోపణలు, నిధులు దుర్వినియోగం చేస్తున్నట్లు తరచూ సోషల్ ఆడిట్‌లో వెళ్లడవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. కొత్తగా కేంద్రం తీసుకున్న ఈకేవైసీ విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్ కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో జాబ్ కార్డుదారుల వివరాలు ..
● మొబైల్ మానిటరింగ్ సిస్టం
యాప్‌లో వివరాలు నమోదు
● ఈకేవైసీ చేయించుకోని
వేతనదారులకు పని నిల్
● జిల్లాలో ఉపాధి వేతనదారులు
6.05 లక్షలు
పనుల్లో పారదర్శకత కోసమే...
జిల్లాలో జాబ్ కార్డుదారులు: 3.51 లక్షలు
ఉపాధి పనులకు వచ్చే కూలీలు: 6.05 లక్షలు
యాక్టీవ్ జాబ్ కార్డుదారులు: 2.75 లక్షలు
పనులకు వచ్చే యాక్టీవ్ కూలీలు: 4.71 లక్షలు
ఈ ఏడాది పనులకు వచ్చిన కుటుంబాలు: 1.93 లక్షలు ఈ ఏడాది పనులకు వచ్చిన కూలీలు: 3.25 లక్షలు
1/1
ఉపాధిలో అక్రమాలకు ఈకేవైసీతో చెక్