
వాల్మీకి రామాయణం మానవాళికి అనుసరణీయం
నరసరావుపేట: మహాకవి వాల్మీకి మహర్షి త్రేతాయుగంలో రచించిన రామాయణం మానవాళికి అనుసరణీయమైన చాలా గొప్ప కావ్యమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి అందరివాడని, వాల్మీకి జయంతి ఏ ఒక్క వర్గానికి చెందినదో కాదని, అందరూ నిర్వహించుకోవాల్సిన పండుగని అన్నారు. వాల్మీకి బోయ సోదరులకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్‌ఓ ఏకా మురళి, రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గంగాధర్, డీబీసీడబ్లు ఈఓ సంతోష్ కుమార్, బీజేపీ అధికార ప్రతినిధి రామకృష్ణ, ఆధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ కృతికా శుక్లా