
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా, ఆనంది(Anandhi) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ప్రేమంటే(Premante)... ఇందులో సుమ కనకాల ప్రధాన పాత్రల్లో కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను విడుదల చేశారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు. దోచావే నన్నే నువ్విలా అనే పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా సింగర్ అబ్బి ఆలపించారు. సంగీతం లియోన్ జేమ్స్ అందించారు.