ఆరుగాలం ఆశలు.. నీటిపాలు | - | Sakshi
Sakshi News home page

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు

Oct 5 2025 2:28 AM | Updated on Oct 5 2025 2:28 AM

ఆరుగా

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు

నదికి నీరు వచ్చిందని

విస్తారంగా పంటల సాగు

అధిక వర్షాలు, ముంచెత్తిన వాగులతో నీట మునిగిన పంటలు

పత్తి, కంది పంటలకు భారీ నష్టం

పత్తి పంట మొత్తం పోయింది

వాగుల్లో నీటరు రావడంతో ఆదిలోనే మంచి జరుగుతుందని ఆశించి పత్తి పంటను సాగు చేశాం. కానీ తర్వాత వచ్చిన వర్షాలు, వాగు ల్లో వచ్చిన అధిక ప్రవాహం కారణంగా సాగు చేసిన పంటలు మొత్తం నీట మునిగాయి. దీంతో పంట ఏ మాత్రం చేతికి రాకుండా పోయింది. పత్తి కాయలు పూర్తిగా మాడిపో యి, ఎందుకు పనికి రాకుండా పోయాయి.ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

– పురుషోత్తం, రైతు, ముండ్లదిన్నె

ఆశలన్నీ జలమయం

వాగులో ఉన్న నీటితోనే ప్రతి ఏడాది సుభిక్షమైన పంటలను పండించుకునే వాళ్లం. ఈ ఏడాది కూడా అలాగే సాగు చేద్దామని విత్తనాలు వేశాం. ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ నదులకు అధిక వరద రావడం, ఆ నీరు వాగులకు చేరడం, కుండపోత వర్షాలు కారణంగా పంటలు కనీసం కాపాడుకునే స్థితిలో కూడా లేకుండా పోయాయి. పత్తి, కంది పంటలు చాలా దెబ్బతిన్నాయి. రైతులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. – ఉప్పరి మహేష్‌,

ముండ్లదిన్నె, రాజోళి మండలం

రాజోళి: కోటి ఆశలతో వాగుల కింద సేద్యం చేసిన రైతులకు సాగు సమయం పూర్తికాక ముందే నష్టం వాటిల్లింది. నీరు పుష్కలంగా వచ్చి పంటలకు ప్రాణం పోస్తుందనుకుంటే, నారు పెంచాల్సిన నీరు ఉసురు తీసిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రతి ఏడాది రైతులు వాగుల కింద వేల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఆశలకు జీవం పోసేలా వచ్చిన వాగులను నమ్ముకుని పంటలు సాగు చేస్తే, అధికంగా కురిసిన వర్షాలు, ముంచెత్తిన వాగులు, వంకలతో పంటలు రోజుల తరబడి నీటిలో మునిగిపోయి కోలుకోని నష్టాన్ని మిగిల్చాయి.

వాగుల కింద జోరుగా సాగు

అలంపూర్‌ నియోజకవర్గంలో వాగుల పరిదిలో వానాకాలం సీజన్‌ ప్రారంభంలో వేల ఎకరాల్లో సాగును మొదలు పెట్టారు. రైతులు ఎక్కువగా పత్తి, కంది,వరి, అక్కడక్కడా మిరప పంటలు సాగు చేయగా.. సింహభాగం పత్తి పంటను సాగు చేశారు. సీజన్‌ ఆరంభంలో అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తనాలు వేసినప్పటికీ, అనంతరం ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి తుంగభద్ర, కృష్ణా నదులకు వచ్చిన వరద నీటితో వాగులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సాగు జోరు మరింతగా పెరిగింది. కానీ ఒక్కసారిగా కురిసిన అధిక వర్షాలతో వాగుల్లో కూడా ప్రవాహం పెరిగి, వాగుల పరిదిలో ఉన్న పంటలు నీట ముగినిపోయాయి. దీనికి తోడు రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆ పంటలు మరింత దెబ్బతిన్నాయి. సాధారణ ప్రదేశాల్లో సాగు అవుతున్న పంటలకు కేవలం వర్షాభావ పరిస్థితులే ఇబ్బందిగా మారగా..వాగుల కింద సాగవుతున్న పంటలకు వర్షాలతో పాటు, వాగుల నుండి వచ్చిన వరద నీరు కూడా ప్రభావం చూపింది. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పరిహారం అందిస్తే రానున్న సీజన్‌లోనైనా సాగును చేసుకుని నష్టాన్ని పూడ్చుకుంటామని రైతులు అంటున్నారు.

ఆగం చేసిన వాగులు

రాజోళి, మాన్‌దొడ్డి, ముండ్లదిన్నె వాగులతో పాటు, మానవపాడు మండలంలోని కలుకుంట్ల,ఉండవెళ్లి మండలం బొంకూరు గ్రా వాగు శివారులోని ఆయా గ్రామాల పరిదిలో ప్రవహించే లింకు వాగులు, వంకల కారణంగా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో ఎన్నో ఆశలతో సాగు మొదలుపెట్టిన రైతులను అధికంగా ప్రవహించిన వాగులు ఆగం చేశాయి.

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు 1
1/3

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు 2
2/3

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు 3
3/3

ఆరుగాలం ఆశలు.. నీటిపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement