
ఉత్పత్తి పెంచేందుకు కొత్త ఆవిష్కరణలు
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను మరింత పెంచేందుకు కొత్త ఆవిష్కరణ తీసుకురానున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఏరియాలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌ల భవిష్యత్‌పై కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు, భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ దిశగా ఏరియాలో సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణల కోసం తీసుకోవాల్సిన చొరవపై చర్చించారు. రానున్న ఐదు సంవత్సరాలకు ప్రణాళికలు, వ్యూహ రచనలు, నష్టాలు తగ్గించుట, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలన్నారు. పెండింగ్ పనుల పరిశీలనలు, ఖర్చులు తగ్గించడం, మంచి ప్రణాళికలను అనుసరించడం తదుపరి అంశాలపై అన్ని గనులు, డిపార్ట్‌మెంట్ ఉన్నత అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌వోటు జీఎం కవీంద్ర, సివిల్ ఏజీఎం రవికుమార్, వివిధ గనుల పీఓలు, మేనేజర్లు శ్యాంసుందర్, భిక్షమయ్య, రవీందర్ పాల్గొన్నారు.