
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి: ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్‌లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఏర్పాటు.. తదితర అన్ని కార్యక్రమాలపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ