
మెరుగైన వైద్యసేవలు అందించాలి
మల్హర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ మధుసూదన్ సందర్శించారు. ఆస్పత్రిలోని మందుల వివరాలు, రికార్డులను పరిశీలించి, సిబ్బంది వివరాలపై ఆరాతీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ప్రభుత్వం వైద్యం పట్ల నమ్మకం కల్పించాలని వివరించారు. సమయపాలన పాటిస్తూ మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నల్ల మధుబాబు, డాక్టర్ వినయ్‌భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి మధుసూదన్