
రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జక్కం దుర్గారాణి కుటుంబసభ్యులకు ఎస్‌బీఐ అధికారులు సోమవారం రూ.1.10కోట్ల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఎస్‌బీఐకి సింగరేణి కంపెనీతో జరిగిన ఒప్పంద ప్రకారం సింగరేణిలో పనిచేసే రెగ్యులర్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే బ్యాంక్ రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బులు మరణించిన వారి కుటుంబీకులకు అందజేయనున్నట్లు ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ గణేశ్యాం, ఆర్‌ఎం నాగవెంకట సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మృతురాలి కూతురు అభినవకు చెక్కును అందజేశామన్నారు. ఈ ఇన్సూరెన్స్ అవకాశం సింగరేణి కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు ఎస్‌బీఐకి సాలరీ ఖాతాను మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ రామస్వామి పాల్గొన్నారు.