
హుండీ ఆదాయం రూ.71,902
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీభక్తాంజనేయస్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ.71,902 వచ్చినట్లు ఆలయ ఈఓ మహేష్ తెలిపారు. సోమవారం ఎండోమెంట్ రెవెన్యూ డివిజన్ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రాధాకృష్ణ, మురళీకృష్ణ, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులలో జరిగిన లోపాలను సవరించి విధులు కేటాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.అశోక్, ఎ.తిరుపతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్లకు ఆర్‌ఓ, ఏఆర్‌ఓ, పీఓ, ఏపీఓలుగా, సీనియర్లకు ఓపీఓలుగా కేటాయించినట్లు ఆరోపించారు. ఎన్నికల విధులలో ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం పదవీ విరమణ పొందే వారికి, దివ్యాంగులకు, దీర్ఘకాల అనారోగ్యం కల వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్)ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుకునే వారికి 2025–2026 సంవత్సరానికి గాను అడ్మిషన్ షెడ్యూలు అపరాధ రుసుంతో ఈనెల 23వరకు అడ్మిషన్ చేసుకోవడానికి గడువు ఉందని కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ నంబర్లు 75699 75383, 63008 54065లో సంప్రదించాలని పేర్కొన్నారు.
మల్హర్: స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం తాడిచర్లలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేశ్, సివిల్, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వెంటేశ్వరస్వామి దేవస్థానం నందు నవంబర్ 3 నుంచి జరిగే జాతర సందర్భంగా కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర ప్రసాదం అమ్ముకునేందుకు లైసెన్స్ హక్కు కోసం ఈ నెల 9న తిరుమలగిరిలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత దరావత్తు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు.

హుండీ ఆదాయం రూ.71,902