
దసరా కిక్కు
జిల్లాలో ఎకై ్సజ్ సర్కిల్ వారీగా అమ్మకాలు
మరో రోజు..
సర్కిల్ లిక్కర్ బీర్ల అమ్మకాలు
కాటన్లు కాటన్లు (రూ.కోట్లలో)
జనగామ 4,589 8,806 రూ.5.57
స్టే.ఘన్‌పూర్ 4,724 7,115 రూ.5.40
పాలకుర్తి 2,922 5,771 రూ.3.41
12,235 21,692 రూ.14.38
జనగామ: దసరా పండుగ సంబురం మద్యం వ్యాపారులకు కిక్కిచ్చింది. జిల్లా వ్యాప్తంగా 47 వైన్స్ షాపులు, ఐదు బార్లలో గత నెల 29వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లోనే 33,927 ఐఎంఎల్, బీర్ కాటన్లు అమ్ముడవగా, రూ.14.38 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాపులు మూసివేయడంతో, 1వ తేదీన కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. చాలా మంది ముందుగానే స్టాక్ చేసుకోవడంతో మద్యం దుకాణాలు ఖాళీ అయ్యాయి. దసరా రోజున మద్యం దుకాణాలు మూసి ఉండడంతో, ప్రజలు 3వ తేదీన ‘పిల్ల దసరా’ ఉత్సవాలు ఘనంగా చేసుకున్నారు. దీంతో, గత ఆరు నెలలుగా అమ్మకాలలో నష్టపోయిన వైన్స్ వ్యాపారులకు ఈసారి దసరా మంచి ఊరట ఇచ్చింది. పండుగల సీజన్ ముగియడానికి ముందే, స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూడా మద్యం వ్యాపారానికి ఊతమిచ్చింది. వివిధ రాజకీయ ఆశావహులు పార్టీ కార్యకర్తలకు విందులు ఏర్పాటు చేయడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి సర్కిల్ పరిధిలో 12,235 లిక్కర్, 21,692 బీర్ల కాటన్ల అమ్మకాలతో రూ.14.38కోట్ల మేర వ్యాపారం జరిగింది.
నెలనెలా మద్యం అమ్మకాల టార్గెట్ చేరుకునేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. దసరా పేరిట రికార్డు కలెక్షన్లు పెరగడంతో ఆ శాఖ సంతోషంలో ఉండగా, వ్యాపారులకు దసరా దీవెనగా భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరివారం నుంచి అమ్మకాలు బాగా పెరిగాయి. ఈనెల 1వ తేదీ నుంచి వ్యాపారులు ఊహించని విధంగా అత్యధిక అమ్మకాలు జరిగాయి. పండుగ వాతావరణం, సెలవులు, ఎన్నికల ఉత్సాహం అన్నీ కలిపి మద్యం అమ్మకాలపై ప్రభావం చూపించాయి. ఒక వైపు భక్తి, మరో వైపు మత్తు దసరా వేడుకల్లో రెండూ జిల్లాలో స్పష్టంగా కనిపించాయి.
ఐదు రోజులు..రూ.14.38కోట్లకు పైగా వ్యాపారం
గాంధీ జయంతితో ముందురోజే
భారీ కొనుగోళ్లు
మద్యం షాపుల యజమానులకు
పండుగ సంబురం
దసరా సెలవుల్లో ఈనెల 5 (ఆదివారం) మాత్రమే మిగిలి ఉండడంతో పండుగ సేల్ కొనసాగనుంది. ఐదురోజుల అమ్మకాల్లో సరాసరి రోజువారీగా రూ.3కోట్ల మేర మద్యం వ్యాపారం జరుగగా, ఆదివారం కూడా అదే జోరు కొనసాగుతుందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. సెలవులు ముగించుకుని 50 శాతం మేర కుటుంబాలు స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరగా.. మరో 50శాతం మంది సొంతూరిలోనే ఉన్నారు. దసరా, పిల్ల దసరా ముగియడంతో..మిగిలి ఉన్న ఒక్క రోజు వచ్చే ఏడాది దసరా పండుగ వరకు గుర్తుండేలా దావత్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ముగిశాయో లేదో..8వ తేదీన స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు సైతం అమ్మకాలు బాగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

దసరా కిక్కు