
వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు
రఘునాథపల్లి: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు మండల వైద్యులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామాల్లో గర్భిణుల (ఏఎన్‌సీఎస్) సర్వే నిర్వహించి వారికి అవసరమైన సేవలను మెరుగుపరిచి, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. గర్భిణులకు యోగా సాధనలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన గర్భధారణతో పాటు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పోగ్రామ్ అధికారి డాక్టర్ కమలహాసన్, వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మల్లికార్జున్, రాంకిషన్, హెచ్‌ఈఓ ప్రభాకర్, విష్ణువర్ధన్‌రెడ్డి, ఏఎన్‌ఎలు, ఆశాలు పాల్గొన్నారు.