
కండిషన్ వాహనాలనే వాడాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ రూరల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు కండిషన్‌లో ఉన్న వాహనాలనే వినియోగించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సందర్శించి పారిశుద్ధ్య వాహనాల పనితీరును పరిశీలించారు. వాహనాల కండిషన్ ఎలా ఉంది? వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 22 వాహనాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని మరో 3 ట్రాక్టర్లు, 5 ఆటో ట్రాలీలు ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించకలుగుతామని, మున్సిపల్ కమిషనర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న వాహనాల కండిషన్‌పై ముందుగా నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఆర్‌టీఓ శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.