
10నుంచి ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్
జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, ఈనెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫెరెన్స్ హల్‌లో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్‌లు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.