
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
● ఏసీపీ పండేరి చేతన్ నితిన్
బచ్చన్నపేట: మద్యం తాగి వాహనాలు నడుపరాదని, మైనర్లకు వాహనాలను ఇస్తే అందుకు తల్లిదండ్రులదే బాధ్యత అని జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాల్లో రూ. 50వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్తున్నా సంబంధిత రశీదులను వెంట ఉంచుకోవాలన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.