
పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే న్యాయం
పాలకుర్తి టౌన్: పోలీస్ సేష్టన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ చెప్పారు. పాలకుర్తి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సీపీ వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. పోలీసు సిబ్బంది చేసిన పరేడ్‌తో పాటు కిట్ ఆర్టికల్ తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రౌ డీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మత్తు పదారథాలు, సైబర్ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఆర్‌బీఎఫ్, హెబ్సిబా బాధితులు
ఫిర్యాదు చేయండి
పాలకుర్తి ప్రాంతంలో ఆర్‌బీఎఫ్, హెబ్సిబా చైన్ సిస్టంలో డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులు పోలీస్‌సేష్టన్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. ఆర్‌బీఎఫ్, హెబ్సిబాపై నమోదైన కేసు ముగిసిపోలేదని, దర్యాపు కొనసాగుతోందని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. నిందితులకు సహకరించిన ఏజెంట్‌లను వదిలే ప్రసక్తే లేదన్నారు.
న్యాయం చేయాలని బైఠాయింపు
మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన కాకర్ల రమేశ్ అనే వ్యక్తి తనను రెండేళ్ల క్రితం కులం నుంచి బహిష్కరించారని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యా దు చేశారు. అదే విధంగా తొర్రూరు గ్రామానికి చెందిన గుర్రం వెంకటమ్మ అనే మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ప్రహరీ నిర్మిస్తుండగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అన్యాయంగా కూల్చారని, తనకు న్యాయం చేయాలని వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్యకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు పోలీస్‌సేష్టన్ ఎదుట మంచుప్పుల, తొర్రూరు గ్రామాలకు చెందిన బాధితులు కొద్దిసేపు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తమకు న్యాయం చేయాలని బైఠాయించారు. సీఐ జానకిరాంరెడ్డి జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేస్తామని సర్దిచెప్పారు.
ఆ దిశగా ప్రజలకు నమ్మకం కలిగించాలి
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి
పాలకుర్తి పీఎస్‌లో సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వార్షిక తనిఖీ