
మహాజాతరకు.. 112 రోజులే
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగి లి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వర కు మహాజాతర జరగనుంది. వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్‌రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అప్ప టి నుంచి మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం సాలహారం (ప్రహరీ)పనులపై దృష్టి సారించారు.
వంద రోజులే లక్ష్యంగా..
మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అఽధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. ఆలయ గద్దెల చుట్టూ సాలహారం నిర్మాణ పనులను మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారం రాతితో నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాగా వేలాది మంది కార్మికులను ఏర్పాటు చేసి రాత్రి, పగలు పనులు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనులపై మంత్రి సీతక్క ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
సాలహారం నిర్మాణానికి మార్కింగ్
సాలహారం(ప్రహరీ) పనులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ ఇంజనీరింగ్ అధికారులు మా ర్కింగ్ చేశారు. సారలమ్మ ఆర్చి ఎగ్జిట్ గేట్ ప్రహరీ నిర్మాణానికి బయట స్థలాన్ని చదును చేశారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మీడియా వాచ్ టవర్ల నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకర, రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ శాఖ ఇన్‌చీఫ్ మోహన్‌నాయక్, ఎండోమెంట్ ఎస్‌ఈ ఓంప్రకాశ్, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న పనులను పరిశీలించారు. ప్రహరీ పనుల మార్కింగ్‌ను కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారు. సాలహారంతో పాటు ఎనిమిది ఆర్చి ద్వారాల నిర్మాణాలతో పాటు అదనంగా మరో ఆర్చి ద్వారం నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ మ్యాప్‌లను చూపిస్తూ పనుల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ పనుల్లో ఎక్కడ కూడా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల్లో తేడా రాకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
పనుల్లో అధికారులు నిమగ్నం