
అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం
పాలకుర్తి టౌన్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సిద్దిపేట జి ల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జగదీశ్వర్‌గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియా ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే కేసులను ఉ పసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
‘సాక్షి’ ఎడిటర్‌పై ఏపీ సర్కారు అక్రమ కేసులను ఎత్తివేయాలి
సోమేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ
ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా