ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల చుట్టూ సముద్ర నిర్బంధం అమలు చేయడానికి యునైటెడ్ స్టేట్స్ 15కు పైగా యుద్ధనౌకలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. అరేబియా సముద్రంలో F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్లు, MV-22 ఓస్ప్రేలను నడుపుతున్న యాంపిఫిబియస్ దాడి నౌక USS ట్రిపోలి (LHA 7) కూడా ఉంది.
ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలలోకి, అరేబియా గల్ఫ్.. ఒమన్ గల్ఫ్‌తో సహా అక్కడ నుంచి బయలుదేరే అన్ని నౌకలపై 1400 GMTకి దిగ్బంధనం నిష్పక్షపాతంగా అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ధృవీకరించింది. అయితే.. ఇరాన్ యేతర లేదా ఇతర దేశాలకు చెందిన పోర్టులకు వెళ్లే నౌకలు హోర్ముజ్ జలసంధి ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని అమెరికా స్పష్టం చేసింది.
USS Tripoli (LHA 7) conducts night flight operations while sailing in the Arabian Sea. Tripoli is designed without a traditional well deck, which allows for more F-35B Lightning II stealth fighters, MV-22 Ospreys, helicopters, and extra maintenance space. During peak operations,… pic.twitter.com/zjQO1nOcmK
— U.S. Central Command (@CENTCOM) April 13, 2026
అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు యూఎస్ఎస్ ట్రిపోలి (ఎల్‌హెచ్‌ఏ 7) రాత్రిపూట విమాన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ నౌకలో లేటెస్ట్ F-35B లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్ జెట్లు, MV-22 ఓస్ప్రే విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే, ఇది సాధారణ నౌకల లాగా కాకుండా ఎక్కువ యుద్ధ విమానాలను మోయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది 20కు పైగా F-35B విమానాలను మోహరించగలదు.
ఇదీ చదవండి: వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సందర్భంలో కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌కు చెందిన చిన్న వేగవంతమైన యుద్ధ పడవలు ఈ నిర్బంధానికి దగ్గరగా వస్తే వాటిని వెంటనే నాశనం చేస్తామని తెలిపారు. ఇరాన్ నౌకాదళంలోని పెద్ద భాగం ఇప్పటికే యుద్ధంలో నాశనం అయిందని కూడా ఆయన పేర్కొన్నారు.


