
రాష్ట్ర తైక్వాండో పోటీలకు ఎంపిక
వడమాలపేట (పుత్తూరు): ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయిలో అండర్–14 బాల బాలికలకు తైక్వాండో ఎంపిక పోటీలు సోమవారం చిత్తూరులో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వడమాలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని రేష్మా తైక్వాండో 20 కిలోల విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు బాపట్ల జిల్లా, రేపల్లెలో జరుగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న రేష్మాను హెచ్‌ఎం కరుణానవనీతం, ఉపాధ్యాయులు అభినందించారు.