
సచివాలయం పక్కనే జీవశ్చవంలా..
నగరి : పట్టణ పరిధి కశింమిట్ట సచివాలయ సమీపంలో నాలుగు రోజులుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నీరు, ఆహారం లేకుండా నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లేవారు గానీ, సచివాలయానికి వచ్చి వెళ్లేవారుగానీ, సిబ్బంది గానీ చూస్తూ వెళుతున్నారు తప్ప.. ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్నది తెలియరాలేదు. ఎండకు, వానకు ఎలాంటి చలనం లేకుండా అక్కడే పడివున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇన్ని రోజులు ఆ ప్రాంతంలో జీవశ్చవంలా పడి ఉన్నా అధికారులు ఎవ్వరూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణం తప్ప చలనం లేని ఇతని పరిస్థితిని ఆరా తీయాలనిని స్థానికులు కోరుతున్నారు.