
గిట్టుబాటు ధర రూ.9 ఇవ్వాలి
కోళ్లు పెంచి పోషిస్తే కార్పొరేట్ సంస్థలు కేజీకి రూ.4.50 నుంచి రూ.6.50 వరకు ఇస్తున్నాయి. ఫీడ్, చిక్స్ క్వాలిటి తక్కువగా ఇస్తున్నారు. దీనివల్ల పెంపకందారులు చాలా నష్టపోతున్నాం. కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉండడంలేదు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా కేజీకి రూ.9 ఇవ్వాలి. ఆరకంగా అధికారులు చొరవ చూపాలి. మాజీవనోపాధిని కాపాడాలి.
– విశ్వనాథరెడ్డి, గంగాధరనెల్లూరు
ఖర్చు పెరిగింది
ఫౌల్ట్రీ రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇటీవల ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగాయి. కరెంటు బిల్లులు, వరిపొట్టు, బొగ్గు, మందుల ధరలు భారంగా మారాయి. కంపెనీ చెప్పిన విధంగా నిబంధనలు పాటించినా గిట్టుబాటు కలగడం లేదు. బ్యాంకు రుణాలు తీర్చలేకపోతున్నాం. అప్పుల పాలవుతున్నాం. అధికారులు స్పందించాలి. మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – కేశవులురెడ్డి, చెన్నారెడ్డిపల్లి, గంగాధరనెల్లూరు

గిట్టుబాటు ధర రూ.9 ఇవ్వాలి