
విచ్చలవిడిగా స్పిరిట్!
డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లలో తరలుతున్న వైనం
మహారాష్ట్ర, గోవాల నుంచి ఏపీలోకి
గతంలోనూ స్పిరిట్ లారీలను పట్టుకున్న పోలీసులు
ములకలచెరువు ఘటనతో మరిన్ని
అనుమానాలు
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు ఏపీలోకి విచ్చలవిడిగా స్పిరిట్ దొడ్డిదారిన వస్తోంది. ములకల చెరువుతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఈ మద్యం తయారీకి అసలైన ముడిసరుకు ఆర్‌ఎస్(రెక్టిఫైడ్ స్పిరిట్). గతంలో మన రాష్ట్రంలోకి మహారాష్ట్ర, గోవాల నుంచి కర్ణాటక మీదుగా వచ్చేది. ఎవరికీ అనుమానం రాకుండా ఆర్‌ఎస్‌ను ఆయిల్ ట్యాంకర్లలో స్మగింగ్ చేసేవారు. అప్పట్లో పలమనేరు పోలీసులు సైతం డీజిల్ ట్యాంకర్‌లో ఆయిల్ బిల్లుతో వస్తున్న స్పిరిట్ ట్యాంకర్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో గంగవరం మండలంలోని ఓ కోళ్ల ఫామ్‌లో నకిలీ మద్యం గుట్టురట్టయ్యింది. తయారీ పరికరాలు బెంగళూరు, నరసాపురం నుంచి వస్తుంగా.. స్పిరిట్ మాత్రం మహారాష్ట్ర నుంచి తమకు అందుతోందని పట్టుబడిన వ్యక్తులు ఎకై ్సజ్ పోలీసులకు చెప్పారు. తాజాగా ములకలచెరువుతోపాటు విజయవాడ ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారవతున్నందున స్పిరిట్ అక్రమ రవాణా మళ్లీ సాగుతోందని తెలుస్తోంది.
ఇదో పెద్ద నెట్‌వర్క్
స్పిరిట్‌తో బయల్దేరిన ట్యాంకర్ గమ్యం చేరేదాకా ఓ రహస్య నెట్‌వర్క్ బలంగా పనిచేస్తోంది. ఒక్కో ట్యాంకర్‌కు నలుగురికి పైగా డ్రైవర్లు ఉంటున్నారు. ఈ వాహనానికి ముందు రోడ్డు క్లియరెన్స్ కోసం మరికొందరు ఇతర వాహనాలతో ఎస్కార్ట్‌గా వెళ్తుంటారు. వీరికి అండగా సంబంధిత ప్రాంతాల్లోని స్థానికులు, ఎకై ్సజ్, మార్కెటింగ్, రవాణాశాఖలోని కొందరి అండదండలున్నట్టు సమాచారం. వీరందరూ మొత్తం అక్రమరవాణాను చిన్న మొబైల్ ఫోన్ల ద్వారానే సాగిస్తారు.
రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోనే..
గతంలో నకిలీ మద్యం తయారీ జరిగింది కూడా కర్ణాటక, ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లోనే. ఇప్పుడు కూడా ములకలచెరువు కర్ణాటక రాష్ట్రానికి దగ్గర్లోనే ఉంటుంది. ఎందుకంటే తయారీకి అవసరమైన వస్తువులు చేరవేసేందుకు బోర్డర్లే సేఫ్టీగా వీరు భావిస్తుంటారు. ఏదేమైనా ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్పిరిట్ అక్రమరవాణాపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో పలమనేరులో పట్టుబడిన స్పిరిట్ లారీ