
సీఐటీయూ మహాసభలపై విస్తృత ప్రచారం
చింతపల్లి: అల్లూరి జిల్లా అరకులోయలో ఈ నెల 6న నిర్వహించనున్న సీఐటీయూ బహిరంగ మహాసభను విజయవంతం చేయాలని సీటూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. చింతపల్లిలో ఏరియా ఆస్పత్ర, వ్యవసాయ, ఉద్యాన పరిశోధన స్థానాల్లో ఆయన శనివారం పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీలో జీవో నెం–3 ను పక్కాగా అమలు చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విదుదల చేయాలనే పోరాటాలు చేస్తుందన్నారు. వాటి సాధనకు సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేసేందుకు మహాసభలో కార్యచరణ రూపొందించినట్టు చెప్పారు. అరుకులోయలో జరగనున్న బహిరంగ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు తదితరలు హాజరుకానున్నట్టు చెప్పారు. మహాసభకు కార్మికులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాజేశ్వరి, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు: అరకులోయలో ఈ నెల 6,7వ తేదీల్లో జరిగే సీఐటీయూ జిల్లా 2వ మహాసభను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకర్‌రావు కోరారు. మండల కేంద్రంలో శనివారం సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు, చట్టాలు రక్షణకై సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తుందని, కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, వంటి సమస్యలపై మహసభలో చర్చించి, భవిష్యత్తు కార్యచరణను రూపొందించి, సీఐటీయూ పోరాటాలను ఉధృతం చేస్తుందన్నారు. సీఐటీయూ అన్ని శాఖాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సభలను విజయవంతం చేయాలని నాయకుల పిలుపు

సీఐటీయూ మహాసభలపై విస్తృత ప్రచారం