
నదిలో పడి వ్యక్తి మృతి
ఎటపాక: ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని తోటపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్క ప్రసాద్(49) మంగళవారం ఉదయం పశువులు మేపేందుకు సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లాడు. అయితే గోదావరి నదిలో కలిసే తోటపల్లి వాగు ప్రాంతంలో అవతలి ఒడ్డుకు గేదె వెళ్లింది. దానిని తోలుకొచ్చేందుకు నదిలో దిగే క్రమంలో కాలుజారి నీటిలో పడ్డాడు. ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. దీనిని గమనించిన పరిసర ప్రాంతాల వారు నీటిలో గాలించి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.