
డీఎంహెచ్‌వోగాకృష్ణమూర్తి నాయక్
పాడేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గుంటూరు డీసీఎం రోరమ్ జీఎంసీలో పనిచేస్తున్న ఈయనను పదోన్నతిపై నియమించింది. ఇక్కడ ఇప్పటవరకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డాక్టర్ విశ్వేశ్వరనాయుడు పనిచేశారు. విశాఖపట్నం డీసీఎస్ రోమ్, ఏఎంసీలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్. ప్రసాద్ నాయక్‌ను పాడేరు ఏడీఎంహెచ్‌వోగా, రాజమహేంద్రవరంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పనిచేస్తున్న డాక్టర్ పిల్లి సరితను రంపచోడవరం ఏడీఎంహెచ్‌వోగా నియమించింది.