
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి
● చింతపల్లి జూనియర్ కళాశాలప్రిన్సిపాల్ విజయభారతి
చింతపల్లి: స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) అందజేస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి కోరారు. ఇందుకు మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు కళాశాల అధ్యాపకులు రవీంద్ర నాయక్, జగదీష్‌బాబులను సంప్రదించాలని ఆమె కోరారు.