
మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా..
ఇంద్రవెల్లి: మండలంలోని వాగాయితండాకు చెందిన సత్యభామ–రాథోడ్ దుదిరాం దంపతుల కుమారుడైన రాథోడ్ ప్రమోద్ గ్రూప్–1లో 458.5 మార్కులతో 420వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం దక్కించుకున్నాడు. ప్రమోద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివాడు. 2007–10 విద్యాసంవత్సరంలో ఢిల్లీలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీలో బీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి అక్కడే ప్రస్తుతం పీహెచ్‌డీ మూడో సంవత్సరం చదువుతూ గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. కాగా, ప్రమోద్ ఐదుసార్లు యూపీఎస్సీ సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లడం గమనార్హం.