
నాణ్యమైన వైద్యసేవలందించాలి
ఆదిలాబాద్‌టౌన్: రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, సిబ్బందితో తన చాంబర్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. నవజాత శిశువుల మరణాల రేటు 10 లోపు తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని పేర్కొన్నారు. గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, హైరిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. టీబీ లక్షణాలు ఉన్నవారికి స్క్రీనింగ్ చేసి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, డీపీఓ దేవిదాస్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దేవపూర్ పీహెచ్‌సీ తనిఖీ
తలమడుగు: మండలంలోని దేవపూర్ పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు.