
చిత్తగూడను సందర్శించిన అధికారులు
నార్నూర్: గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని మండలంలోని మాలేపూర్ పంచాయతీ పరిధి చిత్తగూడ గ్రామస్తులు వారం క్రితం ఉమ్రీ వాగు వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. ఈ మేరకు గ్రామాన్ని స్థానిక తహసీల్దార్ జాడి రాజలింగు, ఎంపీడీవో గంగాసింగ్, ఎస్సై అఖిల్ బుధవారం సందర్శించారు. సమస్యలపై ఆరా తీశారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదని, రవాణా కష్టాలు తప్పడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. రోడ్డుకు మరమ్మతులు, కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.