
‘స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం’
నేరడిగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందని ఎంపీ గోడం నగేశ్ ధీమా వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలపరిచిన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూ చించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలన్నారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆకుల రాజశేఖర్, నాయకులు రాజు, భీంరెడ్డి, శంకర్, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.