ఆర్టీసీకి పండుగ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి పండుగ

Oct 9 2025 3:13 AM | Updated on Oct 9 2025 3:13 AM

ఆర్టీసీకి పండుగ

ఆర్టీసీకి పండుగ

కలిసొచ్చిన దసరా, బతుకమ్మ 17రోజులు.. 599 స్పెషల్‌ బస్సులు రీజియన్‌ వ్యాప్తంగా రూ.24.11 కోట్ల ఆదాయం గతేడాదితో పోల్చితే పెరిగిన ఆమ్దాని

ఆదిలాబాద్‌: బతుకమ్మ, దసరా సీజన్‌ ఆర్టీసీకి కలి సొచ్చింది. పండుగ సెలవుల నేపథ్యంలో సెప్టెంబ ర్‌ 20 నుంచి ఈనెల 6వరకు యాజమాన్యం ప్రత్యేక బస్సులను నడపింది. 17 రోజుల పాటు స్పెషల్‌ స ర్వీసులతో సంస్థకు భారీగా ఆదాయం సమకూరింది. బతుకమ్మ పండుగకు ఆడపడుచులు పట్టణాల నుంచి ఊర్లకు చేరుకోవడం, దసరాకు విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు రావడంతో బస్సులు కిటకిట లాడాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ఈ సారి రెగ్యులర్‌ బస్సులతో పాటు రీజియ న్‌ వ్యాప్తంగా 599 ప్రత్యేక సర్వీసులను నడిపింది. గతేడాది పండుగ సందర్భగా రూ.19.42 కోట్ల ఆదాయం రా గా.. ఈసారి రూ.24.11కోట్ల ఆదా యం సమకూరింది. గతేడాదితో పోలిస్తే రూ.4.59 కోట్ల అదనపు ఆమ్దాని సమకూరడం విశేషం.

పకడ్బందీ ప్రణాళికతో..

పండుగ రద్దీకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా బస్సులను నడిపి ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చే ర్చారు. గతేడాది 412 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి 414 స్పెషల్‌ సర్వీసులు నడపాలని తొలుత నిర్ణయించారు. రద్దీ పెరగడంతో మరో 185 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తంగా 599 బస్సులను గతనెల 20 నుంచి ఈనెల 6 వరకు నడపడం గమనార్హం.

అగ్రస్థానంలో నిర్మల్‌ డిపో..

ఆదాయం విషయంలో నిర్మల్‌ డిపో ఈ సారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది ఈ డిపో పరిధిలో రూ.4.96 కోట్ల ఆదాయం సమకూరగా, ఈసారి రూ.6.53 కోట్ల ఆదాయంతో దూసుకెళ్లింది. రూ.1.57కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. రీజియన్‌ వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం బస్సులు 44 లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. 83శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ. 24.11 కోట్ల ఆదాయం సమకూరింది.

అదనపు బస్సులతో.. రూ.1.85 కోట్లు

రీజియన్‌ వ్యాప్తంగా మొత్తంగా 599 అదనపు బస్సులను నడిపారు. ఈ సర్వీసులు మొత్తం 3.04 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. 82,921 మంది ప్ర యాణికులు రాకపోకలు సాగించగా, 92 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో రూ.1.85 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వివరించారు.

కలిసొచ్చిన అదనపు చార్జీ..

పండుగ సమయంలో ఈసారి ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలను వసూలు చేసింది. ప్రత్యేక బస్సుల్లో ఏకంగా 50శాతం అధికంగా వసూలు చేయడం గమనార్హం. గతంలో సూపర్‌ లగ్జరీ, లహరి, రాజధాని వంటి ఉన్నతశ్రేణి సర్వీసుల్లోనే అదనపు చార్జీలు ఉండగా ఈసారి స్పెషల్‌ బస్సులన్నింటిలోనూ అదనపు వడ్డన చేయడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడ్డాయి.

‘మహాలక్ష్మి’లే అధికం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఆర్టీసీలో మొత్తం 49,31,476 మంది ప్రయాణించారు. వీరి లో మహాలక్ష్మి లబ్ధిదారులే అధికంగా ఉన్నారు. మ హాలక్ష్ములు 32,60,025 మంది ఉండగా, టికెట్‌ డ బ్బులు చెల్లించి ప్రయాణించిన వారు 16,71,451 మంది ఉన్నారు. అత్యధికంగా నిర్మల్‌ డిపో పరిధి లో 13,73,205 మంది ప్రయాణించగా, ఇందులో 9,99,123 మంది మహాలక్ష్ములు ఉన్నారు.

రీజియన్‌ పరిధిలో డిపోల వారీగా

సమకూరిన ఆదాయం

డిపో ఆదాయం

(రూ. లక్షల్లో)

ఆదిలాబాద్‌ 550.84

భైంసా 234.97

నిర్మల్‌ 653.81

ఉట్నూర్‌ 141.07

ఆసిఫాబాద్‌ 277.90

మంచిర్యాల 552.41

సమష్టి కృషితోనే సాధ్యం

పండుగ సీజన్‌ దృష్టిలో ఉంచుకొని రీజియన్‌ పరిధిలోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్‌కు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ముందుకు సాగాం. సమష్టి కృషితోనే ఈ ఏడాది అధిక ఆదాయం సమకూరింది. రాబోయే రోజుల్లో సైతం ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తాం.

– ఎస్‌. భవానీ ప్రసాద్‌, రీజినల్‌ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement