
‘కూచిపూడి’లో ప్రతిభ
ఆదిలాబాద్: శాసీ్త్ర య కళకు ఆదరణ తగ్గిపోతున్న ప్ర స్తుత తరుణంలో జై నథ్ మండల కేంద్రానికి చెందిన చిన్నారి సామ మ హతి కూచిపూడి నృత్యం కోర్సులో ఉత్తీర్ణత సాధించింది. జిల్లా కేంద్రంలోని బాలకేంద్రంలో మిట్టు రవి పర్యవేక్షణలో నాలుగేళ్లుగా నృత్యంలో శిక్షణ తీసుకుంటుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు రవి తెలిపారు. ఈ సందర్భంగా బాల కేంద్రం తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.