
అప్రమత్తంగా ఉండాలి
తాంసి: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం, డబ్బు వంటివి అక్రమంగా రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, ఎస్సై జీవన్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.