
పోరాటయోధుడు కుమురంభీం
ఆదిలాబాద్‌రూరల్: జల్, జంగల్, జమీన్‌తో పాటు ఆదివాసీల హక్కుల సాధన కోసం నిజాం సర్కార్‌తో కుమురం భీం అనేక పోరాటాలు చేశారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. హీరా సుకా జాగృతి సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం కుమురంభీం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. కుమురంభీం, రాంజీగోండ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, పోరాటయోధుడు కుమురం భీం జీవి తం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశ య సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నా రు. అనంతరం కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కొడప సొనేరావ్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీ జీవన్ రెడ్డి, జాగృతి సమితి జిల్లా అధ్యక్షుడు సిడాం రాంకిషన్, ఆదివాసీ సంఘాల నేతలు మడావి రాజు, కుర్సేంగే తానాజీ, కుమ్ర రాజు, గేడం వనిత, గేడం గీత, ఆత్రం అనసూయ, యాదవ్‌రావ్, బాపూరావ్, లక్ష్మణ్, ఆనంద్‌రావ్, మనోహర్, శంకర్, సుభాష్ పాల్గొన్నారు.
కై లాస్‌నగర్: భూ భారతి పెండింగ్ దరఖాస్తులు ఈ నెలాఖరులోగా పరిష్కరించి నివేదికలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ మాడ్యూల్స్‌లో అందిన దరఖాస్తులు, పరిష్కారమైన, పెండింగ్‌లో ఉన్న, నోటీసులు జారీ చేసిన, క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన దరఖా స్తుల వివరాలపై మండలాల వారీగా సమీక్షించారు. దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం వహించవద్దన్నారు. ప్రతీ మండలంలో రెండు టీంలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
కై లాస్‌నగర్: వాల్మీకి మహర్షి జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని వాల్మీకి చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి