
పూలే దంపతులను ‘భారతరత్న’తో గౌరవించాలి
ఆదిలాబాద్‌రూరల్: సామాజిక ఉద్యమానికి నాంది పలికి, సీ్త్ర విద్య, మహిళా సాధికారిక, మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతరత్నతో గౌరవించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అన్నారు. సత్యశోధక స్థాపన 152వ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల పూలే దంపతుల విగ్రహాలకు బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో సాంబన్న, సతీశ్, విజయ్, అనిల్, రమేశ్, రాంకిషన్, కల్పన పాల్గొన్నారు.