breaking news
worlds smallest
-
ప్రపంచం లోనే అతి చిన్న మిర్రర్ లెస్ కెమెరా..!
-
ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్..ధర ఎంత ?
ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్ ను సోమవారం లాంచ్ అయింది. టెక్నాలజీ దిగ్గజం, ప్రముఖ ప్రింటర్ల తయారీదారు హెచ్పీ విడుదల చేసిన ఈ ప్రింటర్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ గా కంపెనీ చెబుతోంది. ' డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3700' పేరుతో వస్తున్న ఈ బుల్లి ప్రింటర్ ధరను రూ 7, 176గా ప్రకటించింది. వినియోగదారులు అంచనాలకనుగుణంగా ఈ ప్రింటర్ రూపొందించామని సంస్థ ప్రకటించింది. , కన్స్యూమర్ జీవనశైలి, సరసమైన ధర, ప్రభావవంతమైన, ఉత్పాదక ఉండాలనే కీలక అంశాలపై దృష్టి సారించినట్టు హెచ్ పీ ఇంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ శ్రీవాత్సవ చెప్పారు. తమ తాజా ప్రయోగం తమ వినియోగదారులకు అద్భుతమైన ఇంజనీరింగ్ అనుభవాన్ని ఇవ్వడంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం దీని ద్వారా స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుంచి స్కాన్ చేసుకొని, సులువుగా ప్రింట్ కాపీ తీసుకోవచ్చు. రూ .550 విలువ చేసే కాట్రిడ్జ్ తో సుమారు480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. అలాగే ఒక మోనోక్రోమ్ ముద్రణ కయ్యే ఖర్చుఒక రూపాయి. 403x177x141ఎంఎం డైమన్షన్స్ తో ఉన్న ఈ ప్రింటర్ బరువు 2.33 కిలోలు. అంతేకాదు వైర్ లెస్ ప్రింటింగ్ కోసం వైఫై కి సపోర్టు చేస్తుంది. ఆన్ లైన్ , ఆఫ్ లైన్, రీటైల్ స్టోర్లలో రెడ్, గ్రీన్, బ్లూ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోఉంది. -
ఆ మాటేదో ఈ అమ్మాయికి చెప్పండి..
సరిగ్గా కొత్త ఐదు రూపాలయల బిళ్లంత కూడా లేని కోడిగుడ్డు ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అవును. 1.55 మిల్లీమీటర్ల వ్యాసంతో 'వరల్డ్స్ స్మాలెస్ట్ చికెన్ ఎగ్'గా ఖ్యాతిపొందుతున్న ఈ గుడ్డును యూకేలోని యురీ సెయింట్ ఎడ్మండ్స్ ప్రాంతంలోని ఓ కోడిపెట్ట పెట్టింది. ఆ కోడి ఓనర్ జార్జియా క్రోచ్ మన్. ఆ యువతి ఇంట్లో 20 కోళ్లను పెంచుకుంటోంది. అవి రోజుకు కొన్ని గుడ్లు పెడతాయి. శుక్రవారం కూడా యథావిథిగా గుడ్లు ఏరుతున్న ఆమెకు ఈ అతిచిన్న గుడ్డు కనిపించడంతో మొదట ఆశ్చర్యానికి గురై, తర్వాత మీడియాకు కబురుపెట్టింది. అన్నీ పరిశీలించిన పిదప ప్రపంచంలో అతిచిన్న కోడుగుడ్డు ఇదేనంటూ రికార్డుల వాళ్లు కితాబిచ్చారు. గతంలో ఈ రికార్డు 1.8 సెంటీమీటర్ల కోడిగుడ్డు పేరిట ఉండేది. రికార్డు సంగతి పక్కన పెడితే ఇంత చిన్న గుడ్డుతో ఏం వండుకోవాలా? అని మథనపడుతోందట జార్జియా! మీదగ్గర ఏదైనా ఐడియా ఉంటే ఆ మాటేదో ఆమెకు చెప్పండి..