breaking news
work style
-
కొత్త జాబ్ ట్రెండ్స్.. ప్రయోగాత్మక పని విధానాలు
భారత్‌లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్ కోసం వాలువోక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్‌ప్లేస్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025’ విడుదలైంది.ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్ మెంటారింగ్ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్ (కెరీర్లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్‌షైనింగ్ (జాబ్ టాస్క్‌ల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్ నోమడిజమ్ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులను ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. వృద్ధికే ప్రాధాన్యం.. వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు. -
పనితీరులో మార్పురావాలి
రెవెన్యూశాఖ అధికారులపై సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్ ఆగ్రహం మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్ రెవెన్యూ శాఖ పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పనితీరులో మార్పు రావడం లేదని, ఇక లాభం లేదని, తేదీలు ఖరారు చేసి తానే స్వయంగా తహసీల్దార్లతో సమీక్షిస్తానని భూపరిపాలన శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ అసహనం, అసంతప్తి వ్యక్తంచేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియాకాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. రెక్టిఫికేషన్ మాడ్యూల్లో 7528 దరఖాస్తులకు మాత్రమే పరిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయంపై ప్రతిసారి చర్చిస్తున్నా పట్టించుకోవడం లేదని, తానే మండలాలకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెబ్‌ల్యాండ్ సమస్య ఉందని జేసీ చెప్పడంపై.. ఎక్కడా లేని సమస్య మీకే వస్తుందా? అని ప్రశ్నించారు. రుణఅర్హత కార్డుల దరఖాస్తులను వ్యవసాయశాఖ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. త్వరలో వ్యవసాయ శాఖ వెబ్‌సైట్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఇకనుంచి పంటరుణాలను వెబ్‌ల్యాండ్ ద్వారా సరిచూసుకుని ఇచ్చే విధంగా డీఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచించాలని కోరారు. గ్రామాల్లో అవసరానికి మించి వీఆర్వోలను ఎందుకు ఉంచారని సీసీఎల్ కమిషనర్ రేమండ్ పీటర్ అధికారులపై మండిపడ్డారు. జిల్లాలో నందిగామ, మహబూబ్‌నగర్, ఆమనగల్లు, గద్వాల, పెబ్బేరు, కోస్గిలో అవసరానికి మించి ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. జిల్లాలో 30 శాతం వీఆర్వోల ఖాళీలు చూపిస్తూ అనవసరమైన చోట ఎక్కుమంది వీఆర్వోలను కేటాయించడంపై అసంతప్తి వ్యక్తంచేశారు. మాడ్గుల మండలం ఇర్విన్‌లో ఇద్దరు వీఆర్వోలు ఏం అవసరం ఉందని, వెంటనే ఒకరిని బదిలీచేయాలని సూచించారు. అదేవిధంగా గద్వాలలో ఇద్దరిని ఉంచి మిగతా ఇద్దరిని ఇతర గ్రామాలకు కేటాయించాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎం.రాంకిషన్, డీఆర్వో భాస్కర్, సర్వే ల్యాండ్ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణరాజు, మీసేవా సూపరింటెండెంట్ బక్క శ్రీనివాసులు పాల్గొన్నారు.


