breaking news
Womans fighting
-
Viral Video: చీరల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
కర్ణాటక: తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్ రోడ్డులోని ఒక షాపులో జరిగింది. మైసూరు పట్టు చీరలను 35 శాతం తగ్గింపు ధరలతో అమ్ముతున్నట్లు బోర్డు పెట్టారు. ఆదివారం సెలవు కావటంతో పెద్దసంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఒకే చీరను ఇద్దరు మహిళలు ఎంచుకున్నారు, చీరను వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలై జడలు పట్టుకొని కొట్టున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఇతర మహిళలు ఇద్దరినీ విడిపించారు. Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0 — RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023 -
ఆడవాళ్ల ముష్టి యుద్ధాలు..
వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం లాంటి ఆచారాలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి ఆచారాలను మనదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ నమ్ముతారు. అమెరికాలోని మెక్సికో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేం దుకు ప్రతి ఏటా ఓ పండుగ జరుపుకొంటారు. పండుగ రోజున అక్కడి ఆడవాళ్లంతా ముష్టి యుద్ధాలు చేస్తుంటారు. ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటారు. అంతేకాదు ఆ రక్తాన్ని మట్టిలో కలిపి చేలల్లో చల్లితే వర్షాలు అధికంగా కురుస్తాయని వారి నమ్మకం.