breaking news
Walls of house
-
గోడలకు వేలాడే సంగీతం ఇది.. ఎప్పుడైనా విన్నారా!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్సంగ్..తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వైర్లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్లా అమరిపోతుందంటున్నారు.ఇవి చదవండి: ఆన్లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ.. -
పిడకలు.కామ్
అప్రాచ్య దేశాల్లో ఎక్కడ చూసినా బోసిగోడలే! ఏ ఇళ్లలో చూసినా పొగలేని పొయ్యిలే! పేడ పరిమళం నాసికకు సోకే అవకాశమే ఉండదు. దగ్గరగా ఉండేవాటి విలువను మనం తెలుసుకోలేం. పిడకలూ అందుకు అతీతం కాదు. దూరపు కొండలు ఎంత నునుపుగా ఉంటాయో, దగ్గరగా చూశాక విదేశాల్లో స్థిరపడ్డ మనవాళ్లకు తాము కోల్పోతున్నదేదో అర్థమయ్యే ఉంటుంది. మన కళా సంస్కృతుల విలువ మాత్రమే కాదు, సంస్కృతిలో అవిభాజ్యమైన పిడకల విలువ కూడా వాళ్లకు బాగానే తెలిసొచ్చి ఉంటుంది. బహుశ అందుకేనేమో! ఆన్లైన్లో పిడకలకు గిరాకీ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని, ఒక నొక్కు నొక్కితే చాలు. పిడకల పార్సెల్ ఇంటికొచ్చిపడుతోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. అనే రీతిలో దేశభక్తులగు మన ప్రవాసులు పార్సెళ్లలో పిడకలు తెప్పించుకుంటూ, వాటితో అక్కడ సంప్రదాయానికి లోటు రాకుండా భోగిమంటలు వేసుకుంటున్నారు. పిడకలు - ఉపయోగాలు * తొలిరోజుల్లో పిడకలను వంటచెరకుకు అనుబంధంగా వాడేవారని తెలిసిందే. పిడకలు కాలిన తర్వాత మిగిలిన బూడిదను అంట్లగిన్నెలు తోముకోవడానికే కాదు, పళ్లుతోముకోవడానికి కూడా ఉపయోగించేవాళ్లు. * పిడకలు తయారు చేసేటప్పుడు పేడలో కాసిన్ని వేపాకులు కూడా కలిపేవారు. వేపాకులు కలిపిన పిడకలను ఎండబెట్టిన తర్వాత కాలిస్తే, వాటి నుంచి వెలువడే పొగకు దోమలు పరారయ్యేవి. మస్కిటో కాయిల్స్ తెలియని రోజుల్లో జనాలు వీటినే కాల్చేవారు. * సగటు పరిమాణంలో ఉండే ఒక పిడక నుంచి దాదాపు 2100 కిలోజౌల్స్ శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. అందువల్ల వీటిని ప్రత్యామ్నాయ ఇంధనంగా భేషుగ్గా వాడుకోవచ్చు. * తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్లు పిడకల పరిశ్రమను పెట్టుకునే అవకాశాన్ని నిక్షేపంగా పరిశీలించవచ్చు. ఆన్లైన్ మార్కెట్లో డజను పిడకల ధర దాదాపు రూ.150 వరకు పలుకుతోంది. - పన్యాల జగన్నాథదాసు