breaking news
Villages Progress
-
పల్లె ప్రగతికి విఘాతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : స్థానిక సంస్థల ఎ న్నికలు ఈ నెలాఖరులోగా జరగకపోతే పల్లె ప్రగతి కుంటుపడుతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల తో గ్రామాలు సతమతమవుతాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి నిలిచిపోతుంది. పారిశుద్ధ్యాన్ని సైతం మెరుగుపర్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాయి. చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలకు ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆరువారాల పాటు ఎన్ని కల కోడ్ అమల్లో ఉంటే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ము ఖ్యంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలన్న సంకల్పానికి బ్రేక్ పడనుంది. వైఎస్సార్ కాపు నేస్తం, జననన్న చేదోడు, ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోనున్నాయి. స్థానిక సంస్థల జనాభా దామాషా ప్రకా రం, జిల్లా వెనుకబాటు, స్థానిక సంస్థల పనితీరు తదితర అంశాల ఆధారంగా ఏటా ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. గతంలో పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 25శాతం, జెడ్పీకి 25శాతం నిధులు విడుదలయ్యేవి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చాక పంచాయతీలకు 90శాతం నిధులు, జెడ్పీ కి కేవలం 10శాతం నిధులను కేటాయిస్తూ వచ్చింది. మధ్యలో మండల పరిషత్‌లకు నిధుల్లేని పరిస్థితి ఉండేది. అయితే, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు గగ్గోలు పెట్టడంతో మునుపటి మాదిరిగా 15వ ఆర్థిక సంఘంలో పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 25 శాతం, జిల్లా పరిషత్‌కు 25 నిధు లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖత చూపింది. పాత పద్ధతిలో నిధులు విడుదల చేయనుండటంతో అటు పంచాయతీలు, ఇటు మండల, జిల్లా పరిషత్‌లు నిధులతో కళకళలాడనున్నాయి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితేనే.. లేదంటే నిధుల్లేమితో వెలవెలబోతాయి. చెప్పాలంటే ప్రగతి అటకెక్కనుంది. జిల్లాకు రూ.300కోట్లు మార్చిలో ఎన్నికలు పూర్తి చేయగలిగితే రాష్ట్రా నికి రూ.5800కోట్లు వస్తాయి. అందులో మన జిల్లాకు రూ.300కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశానాలు, కనెక్టవిటీ లేని ప్రాంతాల్లో రహదారులు నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడతా యి. జిల్లాలో 1190 పంచాయతీలు, ఒక కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ప్రజలకు అవసరమైన కనీస వసతులు కల్పించడానికి 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపయోగపడతాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన ఎన్నికల కారణంగా వందల కోట్ల నిధులకు జిల్లా దూరమైపోతోంది. ఆరువారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడంతో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు ఉంటే తప్ప కేంద్రం నిధులు విడుదల చేయదు. అది కూడా ఈనెలాఖరులోగానే పాలక మండళ్లు ఎన్నికవ్వాలి. తాజా ఎన్నికల సంఘం ఆదేశాలతో కేంద్రం నుంచి రావల్సిన ఆర్థిక సంఘం నిధులకు నోచుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పల్లెలు, మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున అభి వృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా వేయడంతో ఈ లోపు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. ముఖ్యంగా జిల్లాలో 53,660 మందికి ఉగాది రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధం చేసింది. లేవుట్లు వేసి, లబి్ధదారులకు ప్లాట్లు లాటరీలో కేటాయింపు కూడా చేశారు. దీంతో ఉగాది ఎప్పుడొస్తుందా అని లబి్ధదారులు ఎ దురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలు నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లాయి. అదే విధంగా ఏప్రిల్‌లో వైఎస్సార్ కాపు నేస్తం కింద కాపులకు సాయం చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 4111మందికి రూ. 15వేలు చొప్పున అందజేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఆరు వారాల వాయిదాతో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈ కార్యక్రమం కూడా ఆగిపోనుంది. జగనన్న చేదోడు పథకం కింద 3188మంది నాయీ బ్రాహ్మణులకు, 6873 మంది రజకులకు, 4785 మంది టైలర్లకు రూ. 10వేలు చొప్పున సాయం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి కూడా బ్రేక్ పడింది. అలాగే, ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాలో 8లక్షల 44వేల మందికి కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసింది. ఇప్పుడు వాటికి కూడా అడ్డు పడింది. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను ఆరువారాలు పాటు వాయిదా వేయడంతో ఈలోపు ఎవరికైనా అరోగ్య పరమైన సమస్యలు వస్తే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలైతే నిరుపేదలు ఇబ్బందులు పడాల్సిందే. వైద్యం కోసం ఖర్చుపెట్టలేక ప్రాణాలను పణంగా పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్ ఆసరా కింద జిల్లాలో 42,278 డ్వాక్రా సంఘాలకు లబ్ధి చేకూర్చాల్సి ఉంది. ఆ సంఘాల్లోని 5లక్షల 20వేల మహిళలు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే జనగన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. వీరంతా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఉసూరుముంటున్నారు. చెప్పాలంటే పది రోజుల్లో పూర్తి కావాల్సిన ఎన్నికలపై చంద్రబాబు అండ్‌కో చేసిన కుట్రలతో జిల్లాలో లక్షలాది మంది ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. వారంతా ఇప్పుడు ఎన్నికల సంఘం తీరుపై మండిపడుతున్నారు. -
పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చిన్నకోడూరు: పల్లెలు బాగుంటేనే దేశం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ నిర్మాణ్ కార్యక్రమంలో భాగంగా శనివారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కేంద్ర ప్రభు త్వ సహకారాన్ని అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 28 కోట్లు, రైతు సంక్షేమం కోసం రూ. 21 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులను 12 నుంచి 20 వారాల వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో.. బేటీ పడావో.. ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి పథకాలతో పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. యూపీఏ కుట్రవల్లే భద్రాచలం ముంపు ఏపీ విభజనను యూపీఏ ప్రభుత్వం చేపట్టగా టీఆర్ఎస్తోపాటు బీజేపీ కూడా మద్దతు తెలపడంతో తెలంగాణ ఏర్పడిం దని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం మెదక్ జిల్లా గజ్వేల్ మం డలం ప్రజ్ఞాఫూర్‌లో ఆయన మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యేలా అప్పటి యూపీఏ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఏ వివాదానికైనా చర్చలతో పరిష్కారం దొరుకుతుందన్నారు. -
స్వచ్ఛభారత్ నిర్వహణ భేష్
- ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతో సాధ్యం - పల్లెల ప్రగతికి ప్రధాని మోదీ ప్రాధాన్యం - జిల్లాలో పర్యటించిన నీతి ఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా ప్రజలు స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ ఆదర్శమని నీతిఆయోగ్ జాతీయ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా కితాబిచ్చారు. ఎంతటి అభివృద్ధి అయినా ప్రణాళికతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పల్లెల ప్రగతి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో విసృ్తతంగా పర్యటించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి అబ్బురపడ్డారు. షాద్‌నగర్ మండలంలోని కిసన్నగర్లో ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించుకున్న తీరును తెలుసుకున్న ఆయన గ్రామస్తులను అభినందించారు. స్థానిక ఉన్నతపాఠశాలలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. అంతకుముందు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జిల్లాలోని కొత్తూరు మండలం నందిగామకు చేరుకున్న అరవింద్ పనగారియాకు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ టీకే శ్రీదేవి, జేసీ రాంకిషన్ ఘనస్వాగతం పలికారు. నందిగామలో మిషన్‌కాకతీయ పథకం కింద దాదాపు రూ.86లక్షలతో మరమ్మతు చేపట్టిన చిన్నయ్య చెరువును పరిశీలించారు. ఆయకట్టు వివరాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. చెరువులకు మరమ్మతులు చేయడం ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు అందుతుందని ఎస్.నిరంజన్‌రెడ్డి వివరించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాల ప్రయోజనాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. షాద్‌నగర్ మండలం రాయికల్‌లో ఉద్యానవన నర్సరీని సందర్శించి.. మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. రైతులకు వస్తున్న లాభాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, మార్కెట్ సౌకర్యం తదితర వాటిపై అధికారులు వివరిస్తున్నంత సేపు ఆసక్తిగా ఆలకించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.8లక్షల చెక్కును కిషన్‌నగర్ గ్రామసర్పంచ్‌కు అరవింద్ పనగారియా అందించారు. కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.