breaking news
Vijayanagar Samrajyam
-
వృషభం ఎక్కడికి పోతుంది?
హరికథా పితామహుడిగా పేరుగాంచిన ఆదిభట్ల నారాయణదాసు ఇంట్లో ఉన్నప్పుడు గోచీ మాత్రమే కట్టుకునేవారు. బయటికి వెళ్తే మాత్రం పట్టు వస్త్రాలు ధరించేవారు. గంధపు పూత, కొప్పుకు పూదండ, ఆభరణాలు, హారాలు... చాలా దర్జాగా ఉండేది వ్యవహారం. ఆ వేషధారణలో ఓసారి విజయనగరం ఆస్థానానికి వెళ్లారు. అసలే మనిషి ఎత్తు. ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండేవారు. దానికి తగిన లావు. ఈ ఆహార్యాన్ని చూసి, సంస్థానాధీశుడు శ్లేషగా, ‘కవి వృషభులు ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు’ అని పలకరించాడు. కవి కేసరి, కవి కోకిల లాంటి బిరుదులు ఇవ్వడం మన సాంప్రదాయమే. ఆ కోవలో కవి వృషభులు అనడం ఆదిభట్లను గౌరవించడమూ అదే సమయంలో వృషభంలా ఉన్నావు అని వెక్కిరించడమూ కూడా. మరి ఆదిభట్ల తక్కువవాడా? రాజు అంటే అన్నీ ఇచ్చేవాడు కదా! ఆ అర్థం వచ్చేట్టుగానూ మరో భావం స్ఫురించేట్టుగానూ చమత్కారంగా ఇలా జవాబిచ్చారు. ‘ఇంకెక్కడికి ప్రభూ, కామధేనువు లాంటి మీ దగ్గరికే’. -
విజయనగర సామ్రాజ్యానికి సాటిలేదు
హంపి శిల్పకళ రాయల సామ్రాజ్యానికి ప్రతీక మైసూరు దసరా ఉత్సవాలకు ప్రేరణ హంపియే కళలకు పుట్టినిల్లు కర్ణాటక = హంపి ఉత్సవాల ప్రారంభంలో సీఎం సిద్ధు బళ్లారి: భూమండలంలోనే విజయనగర సామ్రాజ్యానికి సాటిలేదని, ప్రపంచంలోని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కొనియాడిన చరిత్ర హంపికి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. శుక్రవారం రాత్రి హంపిలోని శ్రీకృష్ణదేవరాయ వేదిక వద్ద భువనేశ్వరి దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హంపి గత వైభవం, ఉత్సవాల గురించి వివ రించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ప్రేరణ హంపీయేనని గుర్తు చేసుకున్నారు. విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో దసరా ఉత్సవాలను నిర్వహించే వారని, అదే తరహాలో మైసూరు మహారాజులు దసరా ఉత్సవాలను ప్రారంభించారని, అప్పటి నుంచి కర్ణాటకలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అదే తరహాలో బళ్లారి జిల్లాలోని హంపి ఉత్సవాలను కూడా తాము నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా హంపిలోని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయల పాలన చరిత్ర పుటల్లో నిలిచిపోయిందని కొనియాడారు. అలనాడు హంపి వీధుల్లో రత్నాలు, వజ్ర వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారని చెబుతుండడం కర్ణాటకకు గర్వకారణమన్నారు. మన సంస్కృతి వారసత్వాలు, కళలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణదేవరాయల పాలన చిరస్థాయిగా గుర్తుండేలా ఏటా హంపి ఉత్సవాలు నిర్వహిస్తామని, జనమందరికీ పండుగ కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భారతీ విద్యారణ్య స్వామీజీ, మంత్రులు పరమేశ్వర నాయక్, రోషన్ బేగ్, ఉమాశ్రీ, బళ్లారి ఎంపీ శ్రీరాములు, ఎమ్మెల్యేలు అనిల్ లాడ్, నాగరాజ్, తుకారాం, భీమానాయక్, జెడ్పీ అధ్యక్షురాలు అనిత, బళ్లారి నగర మేయర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వేదికపై ప్రముఖులను ఘనంగా సన్మానించారు.