breaking news
veena vaani
-
వేర్వేరుగా పరీక్ష రాయనున్న కవలలు వీణావాణి
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను రెండు మూడు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 19 నుంచి జరగనున్న టెన్త్ వార్షిక పరీక్షలకు గ్రేటర్ పరిధిలో 1.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 761 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతుండటంతో ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. పరీక్షల సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనిపిల్లలకు మానసికంగా ధైర్యం చెప్పి అండగా ఉండాలని సూచిస్తున్నారు. కోరితేవీణావాణీలకు స్క్రైబ్స్ పుట్టుకతోనే రెండు తలలు అతుక్కునిజన్మించిన వీణావాణీలు 2016 వరకు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడ వారు ప్రత్యేక ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చదువుకోవడం తెలిసిందే. 2017 జనవరిలో వారిని స్టేట్‌హోంకు తరలించగా.. మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు 2018 విద్యా సంవత్సరంలో వీరికి వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు (5618, 5619) ఇచ్చారు. ఇటీవల వీరు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా.. ఇద్దరికీ కలిపి ఒకే హాల్‌టికెట్ ఇవ్వాలా? వేర్వేరుగా ఇవ్వాలా? అనే అంశంపై బోర్డు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకుని ఇద్దరికీ వేర్వేరుగా రెండు హాల్‌టికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడు రోజుల్లో వీరికి హాల్ టికెట్లు అందజేసే అవకాశం ఉంది. వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొని స్వయంగా పరీక్ష రాసే అవకాశం తక్కువ. వీణావాణీలు కోరితే ఇద్దరికీ స్క్రైబ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖప్రకటించింది. ఈసారైనా గట్టెక్కేనా? హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 82 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో 7200 మంది వరకూ సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47155 వేల మంది విద్యార్థులు ఉండగా, 17 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 43139 వేలకుపైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా, పది వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం (సీసీఈ)తో పరీక్షల తీరు మారింది. పిల్లల్లో సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించిన సిలబస్‌పై పలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పట్టు సాధించలేకపోయారు. ఫలితంగా మ్యాథ్స్, సైన్స్‌ల్లో మూడేళ్లుగా విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గుతూ వస్తోంది. ఈ సారి ఎలాగైనా ఉత్తీర్ణత శాతం పెంచి జిల్లా పరువు నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. తల్లిదండ్రులూ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా రూపొందించిన ప్రశ్నపత్రాలతో ఇప్పటికే అభ్యాస పరీక్షలు నిర్వహించాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆ మేరకు వారికి సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాలి. వేళకు ఆహారం అందివ్వడంతో పాటు వేళకు నిద్ర పుచ్చడం, తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేపి చదివించడం, చదువుకునే సమయంలో సాధ్యమైనంత వరకు టీవీ, సెల్‌ఫోన్ వంటివాటికి దూరంగా ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎటువంటి వాదులాటకు దిగకూడదు. పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపే అంశాలను చర్చించరాదు. ప్రతికూల వాతావరణం పిల్లల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. – బి.వెంకటనర్సమ్మ, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి -
'సరోజినిదేవి' వైద్యులపై చర్యలు
-
'సరోజినిదేవి' వైద్యులపై చర్యలు : మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సరోజినిదేవి ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దుష్ప్రచారంతో పేద రోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అవిభక్త కవలలు వీణా-వాణీలను స్టేట్ హోమ్‌కు తరలించాలని చూస్తున్నామని మంత్రి వెల్లడించారు. కలరా, ఇతర విష జ్వరాలపై భయపడాల్సిన పనిలేదని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. సరోజినిదేవి ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని కొందరు అంధులుగా మారిన విషయం తెలిసిందే. -
కష్టాల్లో వీణ-వాణి పర్యవేక్షణ!
- స్టేట్‌హోంకు తరలించే అవకాశముందంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ-వాణిల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. లండన్ పంపించి ఆపరేషన్ చేసే కథ కంచికి చేరింది. ఎయిమ్స్ వైద్యులూ చేతులెత్తేశారు. యుక్త వయస్సు వస్తోంది ఇక మేము ఉంచుకోలేమంటూ నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు..తల్లిదండ్రులేమో ఆ బిడ్డలను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వీణ వాణిల పర్యవేక్షణ, వారికి వైద్యసేవలు ప్రశ్నార్థకంగా మారాయి. వీణ-వాణిల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడాలని ప్రభుత్వం నీలోఫర్ వైద్యులకిచ్చిన ఆదేశాల మేరకు ఆరు రోజుల క్రితం కవలల తండ్రిని పిలిపించారు. కవలలిద్దరినీ తీసుకెళతానని, అయితే దీనికోసం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం వచ్చేలా చూడాలని కోరారు. ఆ తర్వాత నీలోఫర్ వైద్యులు, వీణ-వాణి తండ్రి లేఖ రాయడం మొదలెట్టారు. లేఖ రాసేక్రమంలో సగం పూర్తయ్యాక వీణ-వాణిల తండ్రికి ఫోన్ వచ్చింది. అనంతరం ఆయన లేఖ మధ్యలోనే ఆపేశారు. ఎందుకూ అని వైద్యులు ప్రశ్నించగా, ఐదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళతానని చెప్పారు. ఇప్పుడు ఏడు రోజులైనా తండ్రి ఫోన్ కూడా తీయడం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో నీలోఫర్ వైద్య బృందం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీలోఫర్ ఆస్పత్రి ఎనిమిదేళ్లలోపు చిన్నారులకు మాత్రమే వైద్యమందించే ఆస్పత్రి అని, వీణ-వాణిలకు 13 సంవత్సరాల వయసు వచ్చిందని, ఇక తాము ఇక్కడ వారి పర్యవేక్షణ చూడలేమని చెబుతున్నారు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వైద్యబృందం సర్కారుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. తల్లిదండ్రులు తీసుకెళ్లడానికి నిరాకరిస్తే వారిని స్టేట్‌హోంకు తరలించాలనే ఆలోచన సర్కారుకు ఉన్నట్టు తెలుస్తోంది.