breaking news
varadayyupalem
-
పచ్చని కాపురంలో అనుమానపు చిచ్చు!
భార్యను హతమార్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భర్త వరదయ్యపాళెంలో దారుణం చెదులుపాకం(వరదయ్యుపాళెం): కట్టుకున్న భార్యను.. భర్తే దారుణంగా హతవూర్చిన ఘటన వరదయ్యుపాళెం వుండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. చెదులుపాకం గిరిజన కాలనీకి చెందిన చెంచయ్యు కు నెల్లూరుజిల్లా కోటపోలూరు గ్రావూనికి చెందిన సుజాతవ్ముతో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. అరుుతే కొంత కాలంగా భార్యపై అనుమానంతో తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ కారణంగానే శ్రీసిటిలోని ఓ పరిశ్రవులో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న చెంచయ్యు నెలరోజుల క్రితం ఉద్యో గం మానేశాడు. అరుుతే సోమావారంరాత్రి భార్యభర్తల వుధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో చెంచయ్యు భార్య సుజాతవ్ము తలపై ఇనుపరాడ్డుతో మోది హతవూర్చాడు. దీంతో సుజాత (27) అక్కడికక్కడికే వుృతి చెందింది. అనంతరం తనతండ్రికి భార్యను హత్యచేసిన విషయం తెలిపిన చెంచయ్య వరదయ్యుపాళెం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. సవూచారం అందుకున్న సత్యవేడు సీఐ నరసింహులు, స్థానిక ఎస్ఐ షేఖ్షావల్లి సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో ఆరాతీశారు. పోస్టుమార్టం నిమిత్తం వుృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వ ఏరియూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనాథ అయిన ఆరునెలల చిన్నారి తల్లిహత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో సుజాత ఆరునెలల కుమారుడు అనాథగా మారాడు. తల్లిపాల కోసం బిడ్డ ఏడుపులతో ఆ ప్రదేశం మారుమోగింది. కుటుంబ సభ్యుల రోదనలతో చెదులపాకం కాలనీ శోకసంద్రంగా మారింది. -
దుండగులను శిక్షించాలి
వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు వరదయ్యపాళెం బస్టాండ్ వద్ద శుక్రవారం భారీ ఎత్తున ధర్నా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభివూనులు వరదయ్యుపాళెం బస్టాండ్ ఆవరణలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సమైక్య శంఖారావం యూత్రలో భాగంగా జనవరి 27న వరదయ్యుపాళెం వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఇక్కడ జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. దీనిని ఓర్వలేని కొందరు గురువారం రాత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. విగ్రహం ఎడవు చేతిని విరిచి దూరంగా పడేశారు. దిమ్మెను పాక్షికంగా ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ధర్నా విగ్రహం ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆదివుూలం, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు బీరేంద్ర వర్మల నేతృత్వంలో పార్టీ వుండల నేతలు, స్థానికులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. విగ్రహ ధ్వంసాన్ని పిరికిపందల చర్యగా ఆదిమూలం అభివర్ణించారు. దుండగులను కఠినంగా శిక్షించాలంటూ వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్‌కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నేతలు ఆందోళన విరమించారు. విగ్రహాన్ని బాగుచేయించారు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అభిమానులకు తీవ్ర మనస్థాపం కలిగించింది. శుక్రవారం మధ్యాహ్నం నిపుణులను పిలిపించి విగ్రహాన్ని బాగుచేయించారు. తర్వాత పాలాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న వైఎస్ఆర్ రూపాన్ని ఎవరూ చెరపలేరన్నారు. ఈ కార్యక్రవుంలో వైఎస్ఆర్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదివుూలం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బీరేంద్ర వర్మ, పార్టీ వుండల కన్వీనర్ సుబ్రవుణ్యం రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు వెంకట కృష్ణయ్యు, కడూరు సహకార బ్యాంకు అధ్యక్షుడు హరిబాబు రెడ్డి, సర్పంచ్ల సంఘం వుండల అధ్యక్షుడు తిలక్ బాబు, నేతలు దామోదర్ రెడ్డి, చిన్న, డిబి, చంద్రారెడ్డి, విజయ్ రెడ్డి, చిన్న వెంకటయ్యు, శ్రీనివాసుల రెడ్డి, వుహిళా కన్వీనర్ ధనలక్ష్మి, యుూత్ నేతలు సందీప్(నాని) రెడ్డి, వుహేంద్ర, వుహేష్, తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.