breaking news
Traders Syndicate
-
మస్తుగా దోపిడీ !
సాక్షి ప్రతినిధి,విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం ఎక్సైజ్ డివిజన్లో మద్యం సిండికేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అమాంతం ధరలు పెంచేసి మందుబాబులను దోచుకుంటున్నారు. వీరికి తెలుగు తమ్ముళ్ల సహకారం అందించడంతో అడ్డే లేకుండా పోతోంది. ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందడంతో గరిష్ట చిల్లర ధర ను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మద్యం సిండికేట్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో ఒకటి రెండు ఏరియాలు మినహాయించి ఎంఆర్పీకి మద్యం విక్రయించడం మానేశారు. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 పెంచి విక్రయిస్తున్నారు. పార్వతీపురం డివిజన్లో మొత్తం 80 మద్యం షాపులున్నాయి. వీటితో పాటు మరో పది బార్లున్నాయి. వీటిలో వేలాది కేసుల మద్యం, బీర్ల అమ్మకాలు సాగుతున్నాయి. అత్యధిక షాపుల్లోనూ ఇలా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో క్వార్టర్ బాటిళ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. ఒక్కొక్క బాటిల్‌పై పది రూపాయలకు తక్కువ కాకుండా రేటు పెంచి విక్రయిస్తూ మద్యం సిండికేట్లు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు సహకారం ఉండడంతో సిండికేట్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. ఎక్సైజ్ సిబ్బందికి కొన్ని సూచనలు వెళ్లాయనీ బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. మేం చూసీ చూడనట్టు వ్యవహరిస్తాం....మీరు కూడా అలానే ఉండాలని చెప్పారని తెలిసింది. ఈ డీల్‌లో లక్షలాది రూపాయల చేతులు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎంసీ విస్కీ, ఎం హెచ్ రకాలను క్వార్టర్ బాటిల్ అసలు ధర రూ110 కాగా, దీనిని రూ 120కు విక్రయిస్తున్నారు. ఏసీ ప్రీమియం కూడా రూ115 నుంచి రూ.120 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇదే తరహా మిగతా రకాలకు క్వార్టర్ బాటిళ్లపై పది నుంచి పదిహేను రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. ఇక హాఫ్, ఫుల్ బాటిళ్లనూ అధిక ధరలకు విక్రయించడంతో మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రధాన మద్యం షాపుల నుంచి సరుకు సమీప గ్రామాలకు తరలుతోంది. అయితే ఈ తరలింపులో బెల్ట్ షాపు నిర్వహకులు, మద్యం షాపుల యజమానులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలోలా బల్క్ స్టాక్ తీసుకువెళ్లకుండా ఏ రోజుకారోజు అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా స్టాకును చిన్న చిన్న సంచుల్లోకి తీసుకువెళ్లి సరుకు పూర్తి కాగానే, మర్నాడు మళ్లీ అవసరం మేరకు తరలిస్తున్నారు. నిఘా ఉంచాల్సిన అధికారులు కూడా పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందితే దాడులకు వెళ్లే ముందే ఆయా ఇళ్లకు సమాచారం అందించడంతో అసలే తక్కువ సరుకు కావడంతో వారు అప్రమత్తమైపోతున్నారు. -
కోల్డ్ స్టోరేజీ నిర్మాణం జరిగేనా ?
పాలకుల మౌనం గిలకలదిండి హార్బర్లో పెరుగుతున్న కష్టాలు వ్యాపారుల ఇష్టారాజ్యం ఐస్‌ప్లాంట్ నిర్మాణంలోనూ రాజకీయం మచిలీపట్నం : గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకం సమకూరుతోంది. అయినప్పటికీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బోట్ల యజమానులు, మత్స్యకారుల సమస్యలు రోజురోజూకూ పెరుగుతున్నాయి. సోనా బోట్లు, మరపడవల ద్వారా ద్వారా వేటాడి తెచ్చే అతి విలువైన ట్యూనా చేపలకు మార్కెట్లో ఒక్కోసారి సరైన ధర పలకదు. ఆశించిన ధర వచ్చే వరకు వాటిని భద్రపరిచేం దుకు ఇక్కడ కోల్డ్‌స్టోరేజీ లేదు. దీంతో బోట్ల యజమానులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. హార్బర్లో రెండేళ్ల కిందట ప్రారంభమైన ఐస్‌ప్లాంట్ నిర్మాణానికి రాజకీయరంగు పులుముకుంది. రూ.60 లక్షలతో దీని నిర్మాణానికి రెండేళ్ల కిందటే అనుమతులు వచ్చా యి. ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. దీనికి ఎంపెడా నిధులు సమకూర్చగా, పోర్టు విభాగం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 24న గిలకలదిండి హార్బర్లో మత్స్యకారులతో సమావేశమయ్యా రు. ఐస్ప్లాంట్లో నెలరోజుల్లోపు ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రెండు శాఖల అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఐస్‌ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇవ్వటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణం జరిగిందని చెప్పుకునేందుకు మంత్రితోపాటు ఆ పార్టీ నాయకులు యత్నించటం వివాదాస్పదమవుతోంది. అంతా దోపిడీనే.. గిలకలదిండి ఫిషింగ్ హార్బర్లో మత్స్యసంపదను కొనుగోలు చేసే సందర్భాల్లో వ్యాపారుల హవా కొనసాగుతోం ది. నలుగురైదుగురు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వా టి ధరను ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధర చెప్పకుండానే కొనుగోళ్లు.. సోనా, మరబోట్ల ద్వారా తీసుకువచ్చిన మత్స్యసంపద కు ముందుగా ధర చెప్పకుండానే వ్యాపారులు తూకం వేయిం చే ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతోంది. ధర ఇంకా నిర్ణయం కాలేదని, అడ్వాన్స్‌గా కొంత సొమ్ము తీసుకువెళ్లాలని చెప్పి వ్యాపారులు తప్పించుకుంటుంటారు. కోల్డ్ స్టోరేజీ లేకపోవటంతో ధర తక్కువగా ఉన్నప్పటికీ అతి విలువైన టూనా, ఇతర రకాల చేపలను బోటు యజమానులు అమ్ముకోవాల్సిందే. వ్యాపారులు ధర నిర్ణయించకుండా అడ్వాన్స్‌లు ఇచ్చి, మత్స్య సంపదను కొంటున్నారు. దీంతో బోటు యజమానులు, మత్స్యకారులు నష్టపోతున్నారు. ఇక్కడి హార్బర్లో కోల్డ్ స్టోరే జీ నిర్మించాలని బోటు యజమానులు, మత్స్యకారులు ఎన్నేళ్లుగానో కోరుతున్నారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రెండేళ్ల క్రి తం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ప్రతిపాదన పంపారు. తరువాత రాజకీయ సమీకరణాలు మారటంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మంత్రి అయ్యారు. గిలకలదిండి హార్బర్లో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది. ఈనెల 24న ఫిషిం గ్ హార్బర్లో మత్స్యకారులతో మంత్రి రవీంద్ర సమావేశమైనపుడు కోల్డ్ స్టోరేజీ గురిం చి ప్రస్తావించకపోవడంపై వారితోపాటు బోటు యజమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి భూమి అందుబాటులో ఉందని.. గతంలో చేసిన ప్రతిపాదన ఆమోదింపజేస్తే ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.