breaking news
TPCC leader
-
'ఆ అసంతృప్తే టీఆర్ఎస్ను ముంచేస్తుంది'
-
'ఆ అసంతృప్తే టీఆర్ఎస్ను ముంచేస్తుంది'
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థుల్లో సగంమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే అని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ... అభ్యర్థుల జాబితాతోనే టీఆర్ఎస్ డొల్లతనం బయటపడిందన్నారు. టీఆర్ఎస్ జాబితాను తయారు చేసింది ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లే అని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ కేడర్లోనే తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఆ అసంతృప్తే టీఆర్ఎస్ను ముంచేస్తుందని దాసోజు శ్రవణ్ తెలిపారు.