breaking news
special officers appointed
-
ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి ప్రతి 10 మందికీ ఒక అధికారి చొప్పున కేటాయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యూనివర్శిటీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు నియమించిన అధికారులతో ఉన్నత స్థాయి అధికారులు భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. కలెక్టర్లకు మార్గ దర్శకాలను జారీ చేశారు. మండల స్థాయిలో కొంతమంది అధికారులను కొవిడ్-19 ప్రత్యేక అధికారులుగా నియమించారు. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రతి రోజు వివరాల నమోదు, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది. (లాక్డౌన్: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు) కరోనావైరస్ నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఆధ్వర్యంలో నలుగురు ఏఏఎస్‌ల బృందం ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్‌రెడ్డి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. (కరోనా: కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు) -
వార్దా ఎఫెక్ట్ : ప్రత్యేక అధికారుల నియామకం
విజయవాడ : వార్దా తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వార్దా తుపాను పెను తుపానుగా మారింది. దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా సృష్టిస్తోంది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దక్షిణ కోస్తాలో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, తీరం దాటే సమయంలో 80-100కి.మీ వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ప్రత్యేక అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పేరు అధికారి పేరు ప్రకాశం ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు బి.శ్రీధర్ చిత్తూరు రవిచంద్ర వైఎస్సార్ జిల్లా రామ్ గోపాల్