breaking news
shaved youth head
-
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్‌ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
వీడియో హల్చల్: పోలీసులపై వేటు
షాజహాన్‌పూర్: యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీస్తున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సౌత్‌సిటీ కాలనీలో ఓ యువజంట తిరుగుతున్నట్లు అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ముగ్గురు కానిస్టేబుళ్లు, యాంటీ రోమియో స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్లేసరికే ఆ జంటను స్థానికులు పట్టుకుని బంధించారు. యువతిని వెంటేసుకుని తిరుగుతున్నావంటూ యాంటీ రోమియో స్క్వాడ్ ఆ యువకుడికి గుండుగీశారు. ఆ కానిస్టేబుళ్లు చూస్తూ ఊరుకున్నారే తప్ప అడ్డుకునే యత్నం చేయకపోగా.. ఓ కానిస్టేబుల్ ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో సుహేల్ అహ్మద్, లాయక్ అహ్మద్, సోన్పాల్ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లను వెనకేసుకొచ్చేందుకు యత్నించిన అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి కేకే చౌదరిపై విచారణకు ఆదేశించారు. ఈ మొత్తం ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. ఈవ్‌టీజింగ్ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది.