breaking news
Shabir Shah
-
ఆపవయ్యా.. ఇదేమైనా టీవీ స్టుడియోనా?
న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై..’ కొట్టి దేశభక్తిని నిరూపించుకోవాలంటూ కోర్టు హాలులో నిందితుడికి సవాల్ విసిరిన ప్రభుత్వ న్యాయవదిని సాక్షాత్తూ న్యాయమూర్తే తీవ్రంగా మందలించిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లనాటి హవాలా కేసులో ప్రముఖ కశ్మీరీ వేర్పాటువాద నేత షాబీర్ షాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జులై 25న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ హవాలా బ్రోకర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా షాబీర్‌పై కేసు నమోదుచేసిన ఈడీ అధికారులు.. మరో వారం రోజుల రిమాండ్ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరిగాయి. విదేశాల నుంచి నిధులు సేకరించి, కశ్మీర్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న షాబీర్.. విచారణకు సహకరించడంలేదని, నిజానిజాలు రాబట్టేందుకు మరికొన్నిరోజులు రిమాండ్‌కు అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఈడీ తరఫున) వాదించారు. ప్రతిగా డిఫెన్స్ లాయర్.. చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా తన క్లయింట్ షాపై ఈడీ ఒత్తిడి చేస్తోందని కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ లాయర్.. షాబీర్ షాను సంబోధిస్తూ.. ‘నువ్వు నిజంగా దేశభక్తుడివే అయితే, భారత్ మాతాకీ జై..అని బిగ్గరగా అరువు’ అని సవాలు విరిసాడు. దీంతో ఖంగుతిన్న న్యాయమూర్తి.. ‘ఏంటిది? ఇదేమైనా టీవీ స్టుడియో అనుకుంటున్నావా? కోర్టు హాలన్న సంగతి మర్చిపోయావా? సవాళ్లు మానేసి పాయింటుకు రా’ అని తీవ్రంగా మందలించారు. చివరికి, షాబిర్‌షాను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పుచెప్పారు. -
షబీర్ షాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు షబీర్ షాకు ఆదివారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరించారన్న ఆరోపణలతో షబీర్ షాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మంగళవారం ఈడీ ముందు హాజరుకావాలని పేర్కొంది. 2005లో హవాలా ద్వారా ఉగ్రవాదులకు డబ్బు తరలించిన కేసులో షా హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు శనివారం ఢిల్లీ చేరుకున్న వేంటనే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించిన విషయం తెలిసిందే.