breaking news
senior IPS
-
‘పరుగు’న రానున్న రాజీవ్ త్రివేది
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు రాజీవ్ త్రివేది... సీనియర్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పేట్లబురుజులోని నగర సాయుధ విభాగం కార్యాలయంలో జరగనున్న ఏఆర్ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు పరుగు, ఈత, సైక్లింగ్, మారథాన్ల ద్వారా సుదూరాలను చేరుకుని రికార్డులు నెలకొల్పిన ఆయన.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. దీనిలో పాల్గొనేందుకు నేటి ఉదయం 6 గంటలకు జూబ్లీహిల్స్ పరిధిలోని ప్లజెంట్ వ్యాలీలో తన క్వార్టర్స్ నుంచి బయలుదేరతారు. మొత్తం 16 కిలోమీటర్ల దూరాన్ని తన పరిగెడుతూ రానున్నారు. రోజూ ఉదయం రన్నింగ్ చేసే అలవాటున్న ఆయన బుధవారం నాటి రన్నింగ్‌ను ఇలా పూర్తి చేయనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, మదీనా చౌరస్తా మీదుగా ఆయన పరుగు సాగనుంది. -
మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక అధికారి
భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయం.. కేంద్రం నిర్ణయం మల్కన్ గిరి: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించడంతో పాటు ఆపరేషన్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించనుంది. ఇందుకోసం తెలంగాణలోని భద్రాచలం కేంద్రంగా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో మావోల ఏరివేతకు ఆయా రాష్ట్రాలను ఐపీఎస్ అధికారి సమన్వయపరచనున్నారు. ఆయా రాష్ట్రాల మధ్య ఇంటెలిజెన్ ్స సమాచారం పరస్పరం పంచుకోవడంలో ఆ కార్యాలయం చొరవ చూపనుంది. అలాగే అటవీ ప్రాంతంలో రూ. కోట్ల ఖర్చుతో అత్యంత అధునాతన వెబ్ కెమెరాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు వీలు కల్పించనుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ, బస్తర్, కొండగాం, రాంకీ జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దులోని నారాయణపూర్, తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విశాఖ రూరల్, చింతపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలోని మోతిగూడెం, రంపచోడవరం, ఒడిశాలోని మల్కన్ గిరి, కొరాపుట్ జిల్లాలు ఈ కార్యాలయ పరిధిలో ఉంటాయని తెలిసింది.