breaking news
senior doctor advise
-
ఈ యాంటీ వైరల్ డ్రగ్ వాడాలంటే సీనియర్ వైద్యుడే చెప్పాలి
న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ విషయంలో హేతుబద్ధీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసింది. చికిత్సతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సీనియర్ వైద్యుడు సూచిస్తేనే రోగికి ఈ డ్రగ్ వాడాలని నిర్దేశించింది. ఇకపై రెమ్‌డెసివిర్‌ను ఆసుపత్రులే సమకూర్చాల్సి ఉంటుంది. బయటి నుంచి తీసుకురావాలంటూ రోగి సంబంధీకులను ఒత్తిడి చేయడానికి వీల్లేదు. రెమ్‌డెసివిర్ దుర్వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాత్రిపూట, సీనియర్ వైద్యుడు అందుబాటులో లేని సమయంలో రోగికి ఈ డ్రగ్ ఇవ్వాల్సి వస్తే డ్యూటీ డాక్టర్ సీనియర్ వైద్యుడిని ఫోన్లో సంప్రదించాలి. స్పెషలిస్టును లేదా యూనిట్ ఇన్చార్జిని కూడా సంప్రదించవచ్చు. వారి సలహాతోనే రెమ్‌డెసివిర్ ఇవ్వాలి. వారు రాతపూర్వకంగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఇందులో వారి స్టాంప్, సంతకం ఉండాలి. రెమ్‌డెసివిర్ వాడకాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రతి ఆసుపత్రి యాజమాన్యం స్పెషల్ డ్రగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. (చదవండి: ఓటు ఎక్కడో.. వ్యాక్సిన్ అక్కడే ) -
ఆ రోగిని చంపెయ్.. జూనియర్‌కు డాక్టర్ సలహా
వైద్యో నారాయణో హరిః అంటారు. ఎంతటి సీరియస్ పరిస్థితుల్లో ఉన్నాసరే పేషెంట్ల ప్రాణాలను ఎలాగోలా కాపాడాలని డాక్టర్లు శాయశక్తులా కృషిచేస్తారు. కానీ, అలాంటి పవిత్రమైన వైద్యవృత్తికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడో డాక్టర్. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజిలో పనిచేసే సీనియర్ డాక్టర్.. తన జూనియర్‌తో రోగిని చంపేయమని చెప్పాడు. ఈ వ్యవహారం అంతా రికార్డు కూడా అయ్యింది. టీబీతో బాధపడుతూ, పొట్టలో అల్సర్ల కారణంగా తీవ్ర రక్తస్రావం అవుతున్న రోగికి చికిత్స చేయొద్దని చెప్పడమే కాక.. ''అతడిని చంపెయ్. అతడిని ఆస్పత్రిలో చేర్చుకో.. కానీ తనంతట తానే ఆస్పత్రి వదిలి వెళ్లిపోయేలా చెయ్యి'' అని జూనియర్‌కు చెప్పాడు. సీనియర్ సూచనలను జూనియర్ వైద్యుడు కూడా అక్షరాలా పాటించడంతో ముఖేష్ ప్రజాపతి (18) అనే ఆ పేషెంటు కాసేపటికే చనిపోయాడు. వైద్యుల సంభాషణ మొత్తాన్ని ముఖేష్ తండ్రి తీకమ్ ప్రజాపతి తన ఫోన్లో రికార్డు చేశారు. ఈ వ్యవహారం గురించి ఆయన ఆ తర్వాత మీడియాకు వివరించారు. ''రాత్రి 10 గంటల సమయంలో టీబీతో బాధపడుతున్న మా అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్లా. అతడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మెడిసిన్ వార్డులో మేం చెప్పే మాటలను డాక్టర్లు ఏమాత్రం వినిపించుకోలేదు. నోటీసు బోర్డు మీద సర్జరీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ శ్వేతాంక్ ప్రకాష్ ఫోన్ నెంబరు ఉండటంతో ముఖేష్ ఫోన్ నుంచి ఫోన్ చేశా. ఆయన జూనియర్ డాక్టర్‌తో మాట్లాడితే పని జరుగుతుందని భావించా. ఆ తర్వాత ముఖేష్‌ను ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. కానీ కాసేపటికే అతడు చనిపోయాడు'' అని తీకమ్ ప్రజాపతి వివరించారు. ముఖేష్ ఫోన్లో మొత్తం కాల్స్ అన్నీ రికార్డయ్యే సదుపాయం ఉంది. అది ఆన్‌లో కూడా ఉంది. ఆ విషయం ఆ ఫోన్లో మాట్లాడుకున్న వైద్యులకు తెలియదు. ముఖేష్ చనిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ''అతడిని తప్పకుండా చేర్చుకో. సర్జరీలో లేదా మెడిసిన్ వార్డులో చేర్చుకో. అతడిని చంపెయ్యి.. రక్తం తెమ్మని చెప్పు.. వాళ్లంతట వాళ్లే పారిపోతారు'' అని డాక్టర్ శ్వేతాంక్ ప్రకాష్ చెప్పడం ఆ ఫోనులో రికార్డయింది. దాంతో.. ముఖేష్ కుటుంబ సభ్యులు ఎంఎం గేట్ పోలీసు స్టేషన్లో సీనియర్ డాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. తప్పుడు మందులు ఇవ్వడం వల్లే ముఖేష్ చనిపోయాడని ఆరోపించారు. అయితే, ఆడియో క్లిప్‌ను ఎడిట్ చేసి తాను అనని మాటలు కూడా చేర్చారని డాక్టర్ ప్రకాష్ ఆరోపించారు. తాను వెంటనే ఆ రోగికి తగిన చికిత్స చేయాల్సిందిగా జూనియర్‌కు సూచించానని, అతడు సర్జరీ పేషెంటు కాదు కాబట్టి జాగ్రత్తగా చికిత్స చేయాలని చెప్పానన్నారు. ఇదంతా తన పేరు చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నమని చెప్పారు.